Sunday, July 26, 2009

నేను సైతం…

Idi naa swanta kadha kadu.
Naa friend and oka manchi person aina KrishnaMohan gari site http://www.uniqcyberzone.com/svennela/ nunchi yettesindi

స్వామీ! స్వామీ! అంటూ గురువుగారిని పిలిచాడు శిష్యుడు.
నెమ్మదిగా ధ్యానం నుంచి కళ్ళు తెరిచిన గురువు శిష్యునివంక ఏమిటన్నట్టు చూసాడు.
మీరు ప్రపంచం బాగోగులగురించి అంతగా పట్టించుకుంటారు. కొంచెం శిష్యులగురించి కూడా ఆలోచిస్తే బాగుంటుంది.
ఏమి నాయనా! నీకేమి కష్టం వచ్చింది?
నేను ధరించిన ధోవతీ చూడండి గురువర్యా! పూర్తిగా నాశనం అయ్యే పరిస్థితిలో ఉంది. నాకొక కొత్త ధోవతీని ఇప్పిస్తే…
గురువు శిష్యుడి ధోవతీ వంక తేరిపార చూసాడు. నిజంగానే జీర్ణావస్థలో ఉందది.
సరే అంటూ… గురువు శిష్యునికి ఒక కొత్త ధోవతీ తెప్పించాడు. శిష్యుడు ఆనందంగా కొత్త ధోవతీ తీసుకుని వెళ్ళిపోయాడు. కొంచెం సేపు గడిచాక,గురువు తన పాఠం శిష్యులకు ఎంతగా వంటపట్టిందో చూద్దామంటూ, శిష్యుని గదికి వచ్చాడు.
నాయనా! ఇప్పుడు అంతా సౌఖ్యమేనా?
ఓ.. ఈ కొత్త ధోవతీ చాల సుఖంగా ఉందండీ.
ఇంకేమైనా కావాలా?
లేదండీ… మరేమీ అవసరం లేదు.
కొత్త ధోవతీ వచ్చిందిగా… పాత ధోవతీని ఏమి చేసావు?
దానిని దుప్పటిగా వాడుతున్నాను గురువర్యా!
ఓహో.. అయితే మరి పాత దుప్పటిని ఏమి చేసావు?
దానిని కిటికీ కర్టెన్ గా వాడుతున్నాను.
మరైతే పాత కిటికీ కర్టెన్ పారేసావనుకుంటాను?
లేదండీ! దానిని వంటింటిలో గిన్నెలు తుడవడానికి వినియోగిస్తున్నాము.
అయితే గిన్నెలు తుడిచే గుడ్డ?
దానిని ఇప్పుడు నేల తుడవడానికి ఉపయోగిస్తున్నాము.
అయితే నేలను తుడిచే గుడ్డ?…చెప్పు నాయనా!
దానిని ఎలా వినియోగించాలో తెలియలేదు. బాగా చివికిపోయిఉంది. అంచేత… సాయంత్రం భోజన సమయంలో వెలిగించే దీపాలకి వత్తిగా వినియోగిస్తున్నాము.
సంతృప్తిగా గురువు వెనుదిరిగాడు.
ఎప్పుడో చదివిన ఒక కథ ఆధారంగా…
మనకున్న వనరుల్ని పూర్తిస్థాయిలో వినియోగించడం మన బాధ్యత. ఈ నేల మనకి పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి కాదు. మనం మన తరవాత తరాలకి తీర్చాల్సిన అప్పు. వనరుల వ్యర్థపరచడాన్ని ప్రతీ స్థాయిలో అరికట్టాలి.
---------------------

Carbon Footprint is a big concept that is being widely discussed at all levels today.
As humans lets us try to do our bit in saving this beautiful planet from ourselves.

No comments:

Post a Comment